భారతదేశం, ఆగస్టు 21 -- ప్రభుత్వ అంచనా ప్రకారం దేశంలో ఆన్‌లైన్ మనీ గేమ్స్ (బెట్టింగ్)లో ఏటా 45 కోట్ల మంది సుమారు రూ.20,000 కోట్లు కోల్పోతున్నారు. ఇది సమాజానికి పెద్ద సమస్యగా గుర్తించిన ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ది ప్రమోషన్ అండ్ రెగ్యూలేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.

ఆన్‌లైన్ గేమింగ్‌లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. ఒడిశా, పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ గేమ్ ఆడే వారి సంఖ్య వేగంగా పెరిగింది. ఆశ్చర్యకరంగా మొబైల్ గేమింగ్ విషయంలో చిన్న నగరాలు కూడా ముంబై, బెంగళూరులాంటి పెద్ద నగరాలను దాటేశాయి. చాలా ఆన్‌లైన్ గేమింగ్ పోర్టల్స్ తమ యాప్‌లను 'స్కిల్ గేమ్స్'గా ముద్రవేసి ప్రజలను తప్పుద...