భారతదేశం, అక్టోబర్ 31 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్ పర్సనల్ ఫొటోలు ఆన్ లైన్ లో లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇంటి బాల్కనీలో ఆమె నిలబడి ఉన్న పిక్స్ ఓ మీడియా పోర్టల్ పబ్లిష్ చేసింది. దీంతో వివాదం చెలరేగింది. పర్మిషన్ లేకుండా కత్రినా కైఫ్ పర్సనల్ ఫొటోలను ఎలా పబ్లిష్ చేస్తారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ ఘటనపై రియాక్టవుతూ ఘాటు కామెంట్లు చేసింది.

బాలీవుడ్ స్టార్ కపుల్ జోడీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించారు. తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఈ జంట గోప్యంగానే ఉంచుతోంది. కానీ ఇటీవల కత్రినా తన బాల్కనీలో ఉన్న చిత్రాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇది అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నటి సోనా...