భారతదేశం, జనవరి 8 -- మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. గుంటూరులో సరస్ మేళా 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..."డ్వాక్రా సంఘాలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై సొంతగా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 ఏళ్ల క్రితం డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చాను. ఆనాడు డ్వాక్రా మహిళలు మీటింగుల కోసం బయటకు వస్తే ఎంతోమంది ఎగతాళి చేశారు. కానీ నేడు డ్వాక్రా సంఘలు తిరుగులేని వ్యవస్థగా దేశంలోనే రికార్డు సృష్టించాయి. డ్వాక్రా, మెప్నా సంఘాలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. రాష్ట్రంలో కోటీ ...