Hyderabad, జూన్ 20 -- ఆనాటి ముద్దులేవి అంటూ ఓ యువ జంట నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత మూడు నెలలుగా ప్రతి ఆదివారం ఓ కొత్త షార్ట్ మూవీని తీసుకొస్తున్న ఈటీవీ విన్ ఈసారి కూడా అలాంటిదే మరో సినిమాను అందిస్తోంది. ఈ సినిమా పేరు ఏవి. అలనాటి ముద్దులు. మరి ఈ సినిమా విశేషాలేంటో చూడండి.

ఈటీవీ విన్ ఓటీటీ కథా సుధలో భాగంగా ఈ ఆదివారం (జూన్ 22) సరికొత్త షార్ట్ మూవీ ఏవి.. అలనాటి ముద్దులు రాబోతోంది. ఈ విషయాన్ని శుక్రవారం (జూన్ 20) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఊహించని అనురాగం, భావోద్వేగాల కథ ఇది. ఏవి అలనాటి ముద్దులు.. కథా సుధ నుంచి వస్తున్న ఈ కథ జూన్ 22 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే, ప్రొడ్యూసర్, దర్శకత్వ పర్యవేక్షణ కే రాఘవేంద్రరావు కాగా.. డైరెక్టర్ రాంకీ. కృష్ణకాంత్ డైలాగులు అందించాడు. అర్జున్...