భారతదేశం, డిసెంబర్ 23 -- మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదా? అయితే వెంటనే అప్రమత్తం అవ్వండి. ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన గడువు డిసెంబర్ 31, 2025తో ముగియనుంది. ఈ గడువులోపు అనుసంధానం పూర్తి చేయని పక్షంలో మీ పాన్ కార్డ్ చెల్లామణిలో ఉండదు. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీలు, ఐటీ రిటర్నుల దాఖలు వంటి పనుల్లో తీవ్ర ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

నిర్ణీత గడువు లోపు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే రూ. 1,000 ఆలస్య రుసుము (Late Fee) చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, మీ పాన్ కార్డ్ 'ఇన్-ఆపరేటివ్'గా మారుతుంది. అంటే మీరు కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్నా లేదా ఐటీ రీఫండ్‌లు పొందాలన్నా సాధ్యం కాదు.

ఈ ప్రక్రియ చాలా సులభం. మీరు ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఈ క్రింది స్టెప్స్ ద్వారా పూర్తి చేయవచ్చు:

UIDAI ఈ ...