భారతదేశం, మే 25 -- నకు ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి సిమ్ కార్డు పొందడం, పాస్ పోర్టు పొందడం, ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ప్రతిచోటా ఇది తప్పనిసరి. కొన్నిసార్లు మన నిర్లక్ష్యం కారణంగానో, మరే ఇతర కారణాలతోనో ఆధార్ కార్డు పోతుంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్లీ సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు పోతే కొత్త కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం..

ఆధార్ కార్డు ఎక్కడైనా పోతే లేదా మీకు దొరక్కపోతే మొదట అది తప్పుడు చేతుల్లో పడకుండా చూసుకోవాలి. అయితే ఆధార్ కార్డులో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఉన్నందున దాన్ని దుర్వినియోగం చేయడం అంత ఈజీ కాదు. అయినా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.

యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయవచ్చు. మీ ఆధార్ నంబర్ ఎవరికైనా తె...