భారతదేశం, జూలై 10 -- ఇటీవలి కాలంలో ఆధార్ లేకుండా ఏ ముఖ్యమైన పని చేయడం సాధ్యం కాదు. ప్రతీ పనికి ఆధార్ కార్డు తప్పనిసరి డాక్యుమెంట్‌గా మారింది. కానీ చాలామంది ఆధార్‌లలో తప్పుడు వివరాలు ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్లు చుట్టూ తిరుగుతున్నారు. మీ ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీకి సంబంధించిన ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, వీలైనంత త్వరగా సరిదిద్దుకోండి. లేకపోతే అనేక పనులు నిలిచిపోవచ్చు.

ఇప్పుడు మీరు ఈ పనిని ఎంఆధార్ యాప్ ద్వారా చేయవచ్చు. యాప్ ద్వారా పేరు, చిరునామా, పుట్టిన తేదీకి సంబంధించిన వివరాలను సరిచేయడం చాలా సులభం, నిమిషాల్లో పని అయిపోతుంది. ఇంట్లో కూర్చొని ఎంఆధార్ యాప్ ద్వారా మీ వివరాలను ఎలా అప్డేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

ముందుగా ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వ...