భారతదేశం, జూలై 21 -- ఆధార్ కార్డుకు సంబంధించి అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఆధార్ కార్డు కోసం కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చాలా మంది ఆధార్ కార్డులో అనేక మార్పులను చేస్తున్నారు. పేరు నుండి చిరునామా వరకు అనేక మార్పులు చేయవచ్చు. మీరు పుట్టిన తేదీని కూడా మార్చవచ్చు. పుట్టిన తేదీలో తరచుగా మార్పులను నివారించడానికి ప్రభుత్వం కొత్త నియమాన్ని అమలు చేస్తోంది.

ఆధార్ కార్డును జారీ చేసే సంస్థ యూఐడీఏఐ.. ఇప్పుడు ఆధార్, నకిలీ యూఐడీ నంబర్‌ల వల్ల జరిగే మోసాలను నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోబోతోంది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పుట్టిన తేదీ, బయోమెట్రిక్స్‌లో తరచుగా మార్పులు చేయడం నిలిపివేస్తున్నట్టుగా యూఐడీఏఐ సీఈవో భువనేష్ కుమార్ అన్నారు.

తప్పుడు ఫోటోలు, బయోమెట్రిక్స్ వాడకాన్ని నిరోధించడానికి యూఐడీఏఐ అనేక చర్యలు తీస...