భారతదేశం, ఆగస్టు 12 -- భారత పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లేదా ఓటరు ఐడీ వంటి పత్రాలు ఉంటే సరిపోదని బాంబే హైకోర్టు పేర్కొంది. ఒక వ్యక్తికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి పత్రాలు ఉంటే అతను భారత పౌరుడు అవుతాడని అర్థం కాదని చెప్పింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన బాంబే హైకోర్టు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఏడాది పాటు భారత్‌లోనే ఉంటున్నాడని తెలిపింది.

పౌరసత్వం అనేది 1955 పౌరసత్వ చట్టంలోని నిబంధనల ప్రకారం ఖచ్చితంగా నిర్ణయించబడుతుందని హైకోర్టు పేర్కొంది. పౌరసత్వ చట్టం ప్రకారం ఎవరు భారత పౌరులు కావచ్చు? ఎవరు భారత పౌరుడు కాకూడదు? స్పష్టం చేస్తోందని జస్టిస్ అమిత్ బోర్కర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. పౌరసత్వం ఎలా పొందవచ్చో ఈ చట్టం వివరిస్తుందని తెలిపింది. ఆధ...