Adilabad,telangana, జూన్ 12 -- తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేర్వురు చోట్ల పిడుగులు పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వీరిని వ్యవసాయ పనులు చేసుకునే కూలీలుగా గుర్తించారు.

ఏజెన్సీ ప్రాంత పరిధిలోని పిప్పిరిలో పిడుగుపాటు ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. పలువురు కూలీలు విత్తనాలు వేసే క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఈ క్రమంలో వారంతా పక్కన ఉన్న గుడిసెలోకి వెళ్లారు. అదే సమయంలో గుడిసెపై పిడుగు పడింది.ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెెందారు. మరికొందరిని రిమ్స్ కు తరలించారు.

బేల మండలం పరిధిలోనూ పిడుగులు పడ్డాయి. వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుపాట్లకు ఇద్దరు మహిళలు మృతిచెంద...