భారతదేశం, ఏప్రిల్ 16 -- ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడా మండలంలో ధర్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తాగునీటిలో పురుగుమందు కలిపిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు హాని కలిగించేందుకు దుండగులు ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే పాఠశాల సెలవుల దృష్ట్యా మూడు రోజుల పాటు మూసివుండటంతో విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయురాలు ప్రతిభ తెలిపిన వివరాల ప్రకారం పాఠశాల బోధన సిబ్బంది ఒక తరగతి గదిలో ఖాళీ పురుగుమందు సీసాలను గమనించారు. వెంటనే వారు ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్, గ్రామస్తులకు తెలియజేశారు. వారంతా కలిసి విద్యార్థుల ప్రాణాలు కాపాడేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పాఠశాల హెడ్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

పోలీసులు పాఠశాలని పరిశీలించి, కొందరు గు...