భారతదేశం, నవంబర్ 4 -- ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 700 ఎకరాల భూ సేకరణ కోసం ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎంపిక చేశారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయడం సాధ్యమేనని చెప్పింది.

ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నందున 700 ఎకరాలను సేకరించాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రభుత్వ ఉత్తర్వు విడుదల చేశారు.

ఈ సంవత్సరం ఏప్రిల్ ప్రారంభంలో ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి భారత వైమానిక దళం అనుమతి ఇచ్చి...