భారతదేశం, ఆగస్టు 5 -- ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీఓ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రవేశం చేసింది. మంగళవారం, ఆగస్టు 5న ఎన్ఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 675 ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 50.37 శాతం ప్రీమియంతో రూ. 1,015 వద్ద లిస్టింగ్ అయ్యాయి. అదే బీఎస్ఈలో అయితే రూ. 1,018 వద్ద లిస్టింగ్ అయి, 50.81 శాతం లాభాన్ని సాధించింది. ఈ వార్త రాసే సమయానికి అంటే 11.58 గంటలకు బీఎస్‌ఈలో 1072.20కి పెరిగింది. అంటే ఐపీఓ ధరతో పోల్చితే 58.84 శాతం లాభపడింది.

రూ. 1,300 కోట్ల విలువైన ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీఓ జులై 29 నుంచి జులై 31 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంది. ఈ మూడు రోజుల బిడ్డింగ్ సమయంలో, అన్ని వర్గాల నుంచి భారీ స్పందన లభించింది. ఏకంగా 106.23 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బైయర్స్ (QIB) నుంచి అత్యధిక డిమాండ్ లభించింది. ఈ విభాగంల...