భారతదేశం, జనవరి 8 -- ఈ ఏడాది సంక్రాంతికి మరో సర్‌ప్రైజ్ హిట్ రెడీ అవుతోందా? తాజాగా వచ్చిన అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్ చూస్తే అదే అనిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన ఈ మూవీ ట్రైలర్ మొత్తం సరదాగా సాగిపోయింది. సినిమా మొత్తం వందకు వంద శాతం నవ్వులు గ్యారెంటీ అనేలా ఈ ట్రైలర్ ఉంది.

ప్రభాస్, చిరంజీవి, రవితేజ, శర్వానంద్ లాంటి స్టార్ హీరోల మధ్య సంక్రాంతి బరిలో నిలిచాడు యువ నటుడు నవీన్ పోలిశెట్టి. తన మార్క్ కామెడీతో అనగనగా ఒక రాజు మూవీతో రాబోతున్నాడు. జనవరి 14న భోగి రోజు మూవీ రిలీజ్ కానుండగా.. గురువారం (జనవరి 8) ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఓపెన్ చేయగానే.. బుల్లెట్ బండిపై నవీన్ పోలిశెట్టి స్టైలిష్ గా వస్తుంటాడు. బ్యాక్‌గ్రౌండ్ లో నాగార్జున వాయిస్ ఓవర్ చెబుతుంటాడు. అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు అంటూ అది సాగిపోయింది. ...