భారతదేశం, జనవరి 26 -- కారు నడపడం ఒక ఎత్తయితే, విపరీతమైన ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్ నొక్కుతూ గేర్లు మార్చడం మరో ఎత్తు. అందుకే ఇప్పుడు అంతా ఆటోమేటిక్ కార్ల వైపు చూస్తున్నారు. కానీ, ఒకప్పుడు ఆటోమేటిక్ అంటే కేవలం ఒకటే రకం ఉండేది, ఇప్పుడు మాత్రం టెక్నాలజీలు మారిపోయాయి.

మాన్యువల్ కార్లలో మనం క్లచ్ నొక్కి, మన చేత్తో గేర్ మార్చాలి. కానీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో క్లచ్ పెడల్ ఉండదు. కారు వేగాన్ని బట్టి లోపల ఉన్న కంప్యూటర్ లేదా మెకానిజం తనంతట తానే గేర్లు మారుస్తుంది. దీనివల్ల మన ఎడమ కాలుకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది.

దీన్ని 'సెమీ-ఆటోమేటిక్' అని కూడా అంటారు. ఇది నిజానికి ఒక మాన్యువల్ గేర్ బాక్సే, కానీ దానిపై ఒక రోబోటిక్ యూనిట్ ఉంటుంది. మనం గేర్ మార్చాల్సిన పని లేకుండా ఆ రోబోనే క్లచ్ నొక్కి గేర్ వేస్తుంది.

ఎలా ఉంటుంది?: గేర్ మారేటప్పుడు కొంచెం కు...