భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఏపీలోని గుంటూరులో ఉన్న ఆచార్య ఎన్నీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ కళశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సులకు కోర్సుల వివరాలు చూస్తే..

మాస్టర్స్‌లో ఉన్న కోర్సుల విషయానికొస్తే.. ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఐ ఐబీఎం, ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఎంఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ఉన్నాయి. మెుత్తం 189 సీట్లు ఉన్నట్టుగా యూనివర్సిటీ తెలిపింది. ఈ కోర్సుల వ్యవధి రెండు సంవత్సరాలు. పీజీ కోర్సులకు ప్రవేశం కోసం డిగ్రీ మార్కులు, ఏఐసీఈ స్కోరు చూస్తారు.

పీహెచ్‌డీ అగ్రికల్చర్, పీహెచ్‌డీ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, పీహెచ్‌డీ కమ్యూనిటీ సైన్స్ ఉన్నాయి. మూడేళ్ల వ్యవధి ఉంటుం...