భారతదేశం, మే 24 -- అమృత్‌భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద.. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ విస్తరణపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. జూన్‌లో ప్రాథమిక పనులు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కోరారు.

ఘట్‌కేసర్‌ నుంచి యాదగిరిగుట్టకు రోజూ 50వేల పైచిలుకు మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఎంఎంటీఎస్‌ షటిల్‌ సర్వీసులు ప్రారంభించాలని స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ సందర్శనకు హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ఎంఎంటీఎస్‌ రైలు సౌకర్యంగా ఉంటుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనల...