Hyderabad, ఆగస్టు 15 -- సింహ రాశిలో బుధ సంచారం: వైదిక జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా భావిస్తారు. బుధుడు వ్యాపారం, తెలివితేటలకు అధిపతి. బుధుడు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశికి మారతాడు. ఆగష్టు 30న బుధుడు సింహ రాశిలో సంచరిస్తాడు. సెప్టెంబర్ 14 వరకు ఈ రాశిలో ఉంటాడు. సింహ రాశికి అధిపతి గ్రహాలకు రాజు సూర్యుడు.

బుధుడు, సూర్యుడి మధ్య స్నేహభావం ఉంటుంది. కొన్ని రాశుల వారికి బుధుడి సంచారం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలతో పాటు వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధించే సూచనలు ఉన్నాయి. బుధ సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి.

కర్కాటక రాశి జాతకులు బుధ సంచారం నుండి శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో, మీరు కెరీర్ పురోభివృద్ధికి అవకాశాలు పొందవచ్చు. వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ...