Hyderabad, జూలై 24 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి రాశికి మారుతూ ఉంటాడు. అదేవిధంగా నక్షత్ర సంచారం కూడా చేస్తాడు.

ఆగస్టు 3న ఉదయం 4:16కు సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఆగస్టు 30 వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూర్య సంచారం అన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జాతకంలో సూర్యుడు స్థానం బలంగా ఉంటే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, అదృష్టానికి కూడా ఏ మాత్రం లోటు ఉండదు, పేరు ప్రతిష్ఠలు ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది.

సూర్యుడు ఆగస్టు 3న ఉదయం 4:16 గంటలకు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించి ఆగస్టు 30 వరకు ఉంటాడు. ఆ తర్వాత పూర్వఫాల్గుణలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 17న...