Hyderabad, ఆగస్టు 18 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల మార్పుతో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ఈ శుభయోగాలు, అశుభయోగాలు ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు.

జ్యోతిష్య శాస్త్రంలో శనిని న్యాయానికి అధిపతిగా భావిస్తారు. శుక్రుడు శుభగ్రహం. శుక్రుడు విలాసాలు, సంపద మొదలైన వాటికి కారకుడు. జాతకంలో ఈ రెండు గ్రహాలు కూడా వృత్తి జీవితంపైనే కాదు, భౌతిక సుఖాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు.

ఈ రాశుల్లో ఉంటూ ఇతర గ్రహాలతో కలిసి యోగాలను ఏర్పరుస్తున్నాయి. ఆగస్టు 26న ఉదయం 6:30కి శని, శుక్రుడు ఒకరికొకరు 120 డిగ్రీల దూరంలో ఉంట...