Hyderabad, ఆగస్టు 20 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని గ్రహాలతో సంయోగం కూడా జరుగుతుంటుంది. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. కొన్ని కొన్ని సార్లు ఏర్పడే రాజయోగాలు వ్యక్తి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తాయి, సంతోషంగా ఉండేటట్లు చేస్తాయి. మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. 12 రాశులు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి.

మనకి ఉన్న ముఖ్యమైన యోగాల్లో మహాలక్ష్మి రాజయోగం కూడా ఒకటి. ఇది ధనం, సంపద, కళలు, సక్సెస్ వంటి వాటికి కారణం అవుతుంది. జ్యోతిష్య నిపుణులు చెప్పిన ప్రకారం మహాలక్ష్మి రాజయోగం చంద్రుడు-కుజుడు సంయోగం చెందినప్పుడు ఏర్పడుతుంది. ఆగస్టు 25న ఈ మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది.

చంద్రుడు ఆగస్టు 25న ఉదయం 8:28 గంటలకు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పట...