Hyderabad, ఆగస్టు 22 -- ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే చివరి అమావాస్య నాడు పోలాల అమావాస్య జరుపుకుంటాము. ఈసారి పోలాల అమావాస్య శనివారం నాడు వచ్చింది. కనుక శని అమావాస్య అని కూడా అంటారు. శని బాధలు తొలగిపోవాలన్నా, సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు ఈ పరిహారాలను పాటించడం మంచిది. రేపు శనివారం అమావాస్య, అందులో పోలాల అమావాస్య రావడం విశేషం. ఈ చిన్న చిన్న పరిహారాలతో సమస్యలన్నీ తీరిపోతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది, శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంతాన భాగ్యం కలగాలంటే శని అమావాస్య/ పోలాల అమావాస్య నాడు పోలాంబ వ్రతం చేయడం మంచిది. పోలాల అమావాస్య నాడు ఈ వ్రతం చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుంది. సంతానం ఉన్నవారు కూడా పొలాల అమావాస్య వ్రతం చేస్తారు. అలా చేయడం వలన సంతానం సంతోషంగా ఉంటుందని నమ్మకం. పోలాల అమావాస్యనాడు కందమొక్కను పూజిస్తారు. కందమొక్కను గ్రామదేవతగా భ...