Hyderabad, జూలై 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ఖప్పర యోగాన్ని అశుభంగా భావిస్తారు. ఈ ఖప్పర యోగం కారణంగా కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్రావణమాసం మొదలైపోయింది. పూజలు, శుభకార్యాలు ఎక్కువగా జరుపుతారు. ఆగస్టు 13న కుజుడు సింహరాశిలో చురుకుగా సంచారం చేస్తాడు. ఇది ఖప్పర యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది అశుభయోగం.

ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకువస్తుంది. సూర్యుడు, కుజుడు లాంటి శక్తివంతమైన గ్రహాలు అగ్ని మూలకాన్ని ప్రభావితం చేసినప్పుడు కొన్ని రాశుల వారికి సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఏ రాశుల వారికి ఖప్పర యోగం సమస్యలను తీసుకువస్తుందో...