Hyderabad, జూలై 18 -- ఆగస్టు నెలలో కొన్ని గ్రహాల రాశి మార్పు చెందడంతో రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఇది కొన్ని రాశుల వారికి ఎన్నో శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఆగస్టు నెలలో ఏ గ్రహాలు మార్పు చెందుతాయి, ఏ రాశుల వారికి కలిసి వస్తుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు నెలలో అనేక పండగలు వస్తున్నాయి. ఆగస్టు నెలలో రక్షాబంధన్, కృష్ణాష్టమి వంటి ముఖ్య పండుగలను జరుపుకుంటాము. ఆగస్టు నెలలోనే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉండడంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది.

గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఆగస్టు నెలలో కర్కాటక రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఆగస్టులోనే సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కన్యా రాశిలో ఉంటాడు. అదేవిధంగా శని మీన రాశిలో తిరోగమనంలో ఉంటాడు. బుధుడు నేర...