Hyderabad, జూలై 26 -- ప్రతి నెల గ్రహాలు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. ఆగస్టు నెలలో కూడా పలు గ్రహాలు రాశి మార్పుకు చెందుతున్నాయి. ఆగస్టు నెలలో శుక్రుడు ఏకంగా నాలుగు సార్లు సంచారంలో మార్పు చేస్తాడు. ఆగస్టు 1 ఉదయం 3:51కి శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఆగస్టు 12న మధ్యాహ్నం 2:14కి పునర్వసు నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఆగస్టు 21న కర్కాటక రాశిలోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత, ఆగస్టు 23న శుక్రవారం, పుష్యమి నక్షత్రంలోకి అడుగుపెడతాడు.

ఇలా, ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు సార్లు శుక్రుడు సంచారంలో మార్పు చేస్తాడు. శుక్రుడు సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి శుక్రుడి సంచారం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారు శుక్రుని సంచారంతో ప్రత్యేక ...