భారతదేశం, జూలై 29 -- ఆగస్టు నెల విద్యార్థులకు పండుగ మాసంగా మారనుంది. వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నెల ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతంతో ప్రారంభమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ ఇది ఆప్షనల్ సెలవు. దీని తర్వాత ఆగస్టు 9న రెండో శనివారం, రక్షా బంధన్, ఆగస్టు 10న ఆదివారం. విద్యార్థులకు మూడు రోజుల సెలవు లభిస్తుంది.

కొన్ని రోజులు పాఠశాలలు నడిచిన తర్వాత తర్వాత ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం వస్తుంది. దానితో పాటు పాఠశాలల్లో వేడుకలు కూడా జరుగుతాయి. ఆగస్టు 11 నుండి 14 వరకు పాఠశాలలు తెరిచి ఉన్నప్పటికీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలకు రిహార్సల్స్, అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సిద్ధమవుతుంటారు. ఈ సమయంలో విద్యార్థులకు క్లాసులు జరిగేది తక్కువే అని చెప్పవచ్చు.

ఆ తరువాత ఆగస్టు 16న కృష్ణ జన్మాష్టమి జరుపుకొంటారు. ఆగస్ట...