భారతదేశం, జూన్ 21 -- లండన్, జూన్ 21: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‎ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆక్స్‎ఫర్డ్ ఇండియా ఫోరంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని వివరించారు. 'పరిపాలనలో ఆవిష్కరణ - తెలంగాణ కేస్ స్టడీ' అనే అంశంపై ఆయన మాట్లాడారు. భారతదేశంలోనే అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ సమ్మిళిత అభివృద్ధికి, స్థిరత్వానికి, ఆర్థిక పరివర్తనకు ఎలా నిదర్శనంగా నిలిచిందో ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ యాదృచ్ఛికంగా ఏర్పడలేదని, దశాబ్దాల తరబడి సాగిన శాంతియుత ప్రజాస్వామ్య పోరాటం ఫలితమేనని కేటీఆర్ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో "అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రం" తెలంగాణ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ కేవలం ఆశలు మాత్రమే కాకుండా, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి లక్ష్యాలను స్థిరంగా సాధించిందని ఆయన గ...