భారతదేశం, డిసెంబర్ 26 -- అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో వెండి ధగధగలు మునుపెన్నడూ లేని విధంగా మెరుస్తున్నాయి. చరిత్రను తిరగరాస్తూ, తొలిసారిగా ఔన్సు వెండి ధర 75 డాలర్ల మైలురాయిని దాటేసింది. ఒక్కరోజే వెండి ధర సుమారు 5 శాతం మేర ఎగబాకడం ఇన్వెస్టర్లను, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్నాయి.

వరుసగా ఐదో సెషన్‌లోనూ వెండి తన జోరును కొనసాగించింది. ఒకానొక దశలో స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకి (1 ట్రాయ్ ఔన్స్ = 31.1035 గ్రాములు) $75.4 వద్ద రికార్డు స్థాయిని తాకింది. అక్టోబర్‌లో తలెత్తిన 'షార్ట్ స్క్వీజ్' తర్వాత సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు, తాజాగా వెనిజులాలో నెలకొన్న పరిస్థితులు వెండికి డిమాండ్ పెంచాయి. వెనిజులాపై అమెరికా ఆంక్షలు విధించడం, చమురు ట్యాంకర్లను నిలిప...