భారతదేశం, డిసెంబర్ 17 -- బంగారం బాటలో వెండి పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయంగానూ రికార్డులను తిరగరాస్తున్నాయి. డిసెంబర్ 17న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు ఏకంగా 4 శాతానికి పైగా పెరిగి, సరికొత్త శిఖరాలను తాకాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా వెండి ధర తొలిసారిగా 65 డాలర్ల మార్కును దాటడం విశేషం.

బుధవారం ఉదయం 9:20 గంటల సమయంలో, ఎంసీఎక్స్‌లో వెండి ధర 3.38 శాతం జంప్ చేసి కిలోకు రూ. 2,04,445 వద్ద ట్రేడవుతూ జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా 0.21 శాతం తగ్గి రూ. 1,34,129 వద్ద కొనసాగుతోంది.

ఈ అనూహ్య పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి:

అమెరికా నిరుద్యోగ గణంకాలు: అమెరికాలో నవంబర్ నెల నిరుద్యోగిత రేటు 4.6 శాతానికి పెరిగింది. దీ...