Hyderabad, జూలై 24 -- ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటైన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' విడుదలకు ముందే దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన నటుడికి ట్రిబ్యూట్ అందించారు. 'NTR' 'War 2' అనే పదాలను జెట్‌లతో ఆకాశంలో రాశారు. అయితే, ఈ ప్రమోషన్ గురించి తెలియని మెల్‌బోర్న్ పౌరులు అది చూసి ఆందోళనకు గురయ్యారు. ఆ సందేశం ఏదో భయంకరమైన విషయాన్ని సూచిస్తుందని వారు భావించారు.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో 20 రోజుల ముందు నుంచే తారక్ అభిమానుల సందడి మొదలైంది. ఒక రెడిట్ యూజర్ జెట్ విమానాలు మెల్‌బోర్న్ ఆకాశంలో జూనియర్ ఎన్టీఆర్ 'War 2' అని రాస్తున్న వీడియోను పంచుకున్నారు. "మెల్‌బోర్న్‌లో ...