భారతదేశం, జూలై 15 -- అమెరికా న్యూయార్క్​, న్యూజెర్సీలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. సోమవారం నాటికి న్యూయార్క్ సిటీ, ఈశాన్య అమెరికాలోని పలు కీలక ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ (ఆకస్మిక వరద) హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనితో 5 కోట్లకు పైగా అమెరికన్లు వరద ముప్పు ప్రాంతాల కిందకు వచ్చారు. ఆకస్మిక వరదల ప్రమాదం పెరిగిందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. అనేక చోట్ల వరద నీరు రోడ్ల మీద పేరుకుపోయింది. కార్లు, ఇతర వాహనాలు నీట మునిగిపోయిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం వరకు న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్, నెవార్క్, అర్లింగ్టన్ - రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. తీవ్ర వరదల విషయంలో హై అలర్ట్‌లో ఉన్నాయి.

న్యూజెర్సీలోని పశ్చి...