Hyderabad, ఆగస్టు 15 -- తెలుగులో అతి తక్కువ మంది గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్‌ల్లో శివారెడ్డి ఒకరు. సినిమాల్లోకి రాకముందు పలు స్టేజీ షోలలో తన మిమిక్రీతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించి విపరీతమైన క్రేజ్‌తోపాటు ప్రశంసలు అందుకున్నారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తదితర రాజకీయ ప్రముఖుల వాయిస్‌లను పర్ఫెక్ట్‌గా అనుకరించి మంచి పేరు తెచ్చుకున్నారు.

మిమిక్రీ ఆర్టిస్ట్‌గానే కాకుండా జెమినీ టీవీలో జల్సా, కోటేశ్వర రావు, జీ తెలుగులో చిత్తం చిత్తం ప్రాయిశ్చిత్తం, మాటీవీలో ఘర్షణ డ్యాన్స్ షోలకు యాంకర్‌గా వ్యవహరించిన శివారెడ్డి జెమినీ ఛానెల్‌లోని జూలకటకకు న్యాయ నిర్ణేతగా చేశారు. అనేక న్యూస్ ఛానెల్స్‌లో మిమిక్రీతో హాస్యం పండించిన శివారెడ్డి ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా మెప్పించారు.

ముఖ్యంగా ఆనందం సినిమాలో పర్స్ మర్చిపోయా డైలాగ్‌తో ఎంతోమందికి ...