Hyderabad, ఆగస్టు 16 -- పార్వతి దేవదాసుల ప్రేమ కథకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక లవ్ స్టోరీలకు తెలుగు యూత్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈసారి ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు టైటిల్‌తో ఓ విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట రామకృష్ణ దర్శక నిర్మాతగా ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమాలో సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా నటించగా.. గ్లామరస్ బ్యూటీ రాశి సింగ్ హీరోయిన్‌గా చేసింది.

అలాగే, వీరితోపాటు ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమాలో రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత ఇతర కీలక పాత్రలు పోషించారు. రీసెంట్‌గా ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు సినిమా...