భారతదేశం, నవంబర్ 12 -- విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 6 ఖాళీలను రిక్రూట్ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు..నవంబర్ 21వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

6 పోస్టుల భర్తీకి గాను వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఒకటి ఉండగా. రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ ఖాళీలు 1, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌ 2 ఉన్నాయి. ఇక రీసెర్చ్ ఫెలో 1 పోస్టు ఉండగా. టైపిస్ట్ పోస్టు 1 ఉంది. అర్హత గల అభ్యర్థులు https://andhrauniversity.edu.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....