భారతదేశం, నవంబర్ 20 -- రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా అనే మరో సినిమాతో వస్తున్నాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న అతడు.. ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. నవంబర్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి.. తాజాగా ఉపేంద్ర ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఆంధ్రా కింగ్ ఎవరన్నదే సస్పెన్స్ అని అన్నాడు.

ఆంధ్రా కింగ్ తాలూకా పేరుతో రామ్ తో కలిసి ఉపేంద్ర వస్తున్నాడు. ఇందులో అతడు ఓ స్టార్ హీరో సూర్యగా, అతని వీరాభిమాని సాగర్ పాత్రలో రామ్ పోతినేని కనిపిస్తున్నారు. అయితే టైటిల్ ను బట్టి ఆంధ్రా కింగ్ ఎవరో ఊహించవచ్చు. కానీ అక్కడే ఓ ట్విస్టు ఉందని ఉపేంద్ర అంటున్నాడు. మిమ్మల్ని ఆంధ్రా కింగ్ ను చేశారు అని యాంకర్ ప్రశ్న అడగగా.. ఆంధ్రా కింగ్ ఎవరో సినిమా చూస్తే తెలుస్తుంది.. రియల్ ఆంధ్రా కింగ్ ఎవరో.. నేను, రామ్ కాదు ఇంకో ట్విస్ట్ కూడా...