భారతదేశం, డిసెంబర్ 14 -- ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' థియేట్రికల్ రన్ ముగించుకుని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. నవంబర్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 25న అంటే క్రిస్మస్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి మరో నిరాశనే మిగిల్చిన మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా వెనుకబడిపోయింది. దీంతో నెల రోజుల్లోపే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా డ...