భారతదేశం, జనవరి 21 -- లంబసింగి.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. ఇక్కడ ప్రకృతిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. అయితే ఇక్కడ కొంతమంది రైతులు పూల తోటలను పెంచుతున్నారు. దీని ద్వారా బిజినెస్ చేస్తున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి, ఇతర మైదాన ప్రాంతాలకు చెందిన కౌలు రైతులు లంబసింగి ప్రాంతంలో స్థానిక రకం, ఇతర పువ్వులను పెంచుతున్నారు. పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.

ఈ రైతులు నాగ్‌పూర్, పూణే, బెంగళూరు, ఏపీలోని కడియం నుండి మొక్కలు, విత్తనాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పూల లోయగా మార్చుతున్నారు. వివిధ రకాల బంతి, చామంతి, గెర్బెరా, దాలియాతోపాటుగా మరికొన్ని పువ్వులను పెంచుతున్నారు.

అయితే దీనిని ప్రొఫెషనల్‌గా కాకుండా సైడ్ ఇన్‌కమ్‌లా చూస్తున్నారు రైతులు. పర్యాటకుల నుండి కొంత డబ్బు పొందుతున్నారు. ...