భారతదేశం, జనవరి 11 -- ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ కోసం ప్రజలు సంవత్సరం అంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పండుగను రాష్ట్రంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏపీలో సంక్రాంతి పండుగ చూసేందుకు జనాలు వస్తుంటారు. విదేశాల్లో స్థిరపడిన ఏపీ వాసులు కూడా కచ్చితంగా సంక్రాంతి పండుగకు హాజరుకావాల్సిందే. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడి పందేలు, హరిదాసు కీర్తనలు.. ఇలా పల్లె అందాలను చూస్తే సంక్రాంతికి ముచ్చటేస్తుంది.

కానీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామంలో మాత్రం అసలు పండగ చేసుకోరు. దీనికి వెనక ఓ పెద్ద కారణం ఉంది. కనీసం సంక్రాంతి పండుగ రోజున స్నానాలు చేయరు, ఇంటిని ఊడవరు. సాధారణంగా ఎలా ఉంటారో అలానే భావిస్తారు. ఈ పద్ధతి నిన్నా.. మెున్నటి నుంచి మెుదలైంది కాదు. చాలా ఏళ్ల నుంచి పాటిస్తున్నా...