Andhrapradesh, సెప్టెంబర్ 6 -- గత రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలు ఆందోళనను సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు.

జూలై, ఆగస్ట్ నెలల్లో ఈ గ్రామం నుంచి 20 మంది చనిపోవడానికి గల కారణాలపై మొదట దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని. అన్నికోణాల్లోనూ పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం శని, ఆది వారాలు ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం పంపించాలని సూచించారు. గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారం కల్లా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. అక్కడ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల...