Andhrapradesh, ఆగస్టు 23 -- తెలుగు రాష్ట్రాల్లో యూరియా సరఫరా విషయంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు ప్రభుత్వాలు కూడా యూరియా సరఫరా విషయంలో ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. యూరియా కొరత లేకుండా తక్షణమే సరఫరా చేయాలని కోరుతున్నాయి.

యూరియా సరఫరా విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ తెలిపింది. అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. గత ఖరీఫ్ సీజన్ కంటే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లోనే ఎరువులను ఎక్కువగా సరఫరా చేశామని పేర్కొంది. రైతుల ఎరువుల అవసరాలను తీర్చేందుకు... సమయానికి, సమృద్ధిగా ఎరువులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పని చేస్తోందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

యూరియా, ఎరువుల కొరత రాకుండా నెలవారీ సరఫరా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. కొందరు రైతులు అవసరాన...