భారతదేశం, డిసెంబర్ 7 -- ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఎంబీబీఎస్ అడ్మిషన్లలో అమ్మాయిలు సత్తా చాటారు. 60.72 శాతం అమ్మాయిలే ప్రవేశాలు పొందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే 2025-26 విద్యా సంవత్సరంలో 3.66 శాతం అమ్మాయిల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు.

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరానికి సంబందించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలు ఇటీవల ముగిశాయి. వీటి వివరాలను విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి మంత్రికి సత్యకుమార్ కు నివేదించారు.

ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం...2023-24లో 57.06 శాతం, 2024-25లో 57.96 శాతం, 2025-26లో 60.72% మంది చొప్పున అమ్మాయిలు ఎంబీబీఎస్ లో చేరినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పాఠశాల విద్య నుంచే అమ్మాయిలు నీట్ (NEET) లో ఉ...