భారతదేశం, ఏప్రిల్ 29 -- ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి గుర్తింపుతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టపరమైన రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అమరావతి రైతులకు ముఖ‌్యమంత్రి వివరించారు. ఏపీ పునర్విభజన చట్టానికి సవరణ చేసే అవకాశాలను కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టనున్నట్టు అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు భరోసా ఇచ్చారు.

పార్లమెంట్‌‌లో నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటులో నోటిపై చేసేలా విభజన చట్టానికి సవరణ చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, చేయిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు వివరించారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ తానని రాజధాని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. అమరావ...