భారతదేశం, ఏప్రిల్ 24 -- ఆంధ్రప్రదేశ్‌ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్‌ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ కోర్సులతో పాటు ఒకేషనల్ గ్రూపుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయ సంస్థల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్‌లో ప్రవేశాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 33 గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలల్ని నిర్వహిస్తున్నారు.

గిరిజన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన, గిరిజనేతర విద్యార్థ...