భారతదేశం, నవంబర్ 5 -- రాష్ట్రంలో ఏకకాలంలో 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అవినీతి జరుగుతుందన్న సమాచారం ఒకేసారి 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపుదాడులు చేశారు. వివిధ పనుల కోసం వస్తున్న జనాల దగ్గర డబ్బులు లాగుతున్నట్టుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ తనిఖీలు మెుదలుపెట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నరసరావుపేట, ఒంగోలు, ఆళ్లగడ్డ, విశాఖతోపాటుగా మెుత్తం 120 సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు అధికారులు. స్థలాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు పరిశీలించారు. కీలక డాక్యుమెంట్ల గురించి ఆరా తీశారు. అంతేకాదు కార్యాలయంలో అనధికారికంగా ఉన్నవారి గుర్తించి ప్రశ్నించారు.

విశాఖపట్నంలోని మధురవాడ, భోగాపురం, టర్నర్ చౌల్ట్రీ, పెడగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసింది. ...