భారతదేశం, జూన్ 17 -- అమరావతి, జూన్ 17: ఆంధ్రప్రదేశ్‌ను వ్యర్థ రహిత రాష్ట్రంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, 'సర్క్యులర్ ఎకానమీ' (వనరుల పునర్వినియోగం)పై రెండు నెలల్లో తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఏడాదిలోగా రాష్ట్రంలో 3 భారీ 'సర్క్యులర్ ఎకానమీ పార్కులను' ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కొత్త పాలసీ: రెండు నెలల్లో 'సర్క్యులర్ ఎకానమీ'కి సంబంధించిన తుది పాలసీని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఇది వ్యర్థాల నుంచి సంపద సృష్టించడానికి, వనరులను తిరిగి ఉపయోగించుకోవడానికి మార్గదర్శకం అవుతుంది.

3 సర్క్యులర్ ఎకానమీ పార్కులు: ఏడాదిలోగా రాష్ట్రంలో 3 'సర్క్యులర్ ఎకానమీ పార్కులను' ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మొదటిది విశాఖపట్నంల...