భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల అభివృద్ధిపై లోక్‌సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలు ప్రశ్నలు అడిగారు. దీనికి కేంద్ర మంత్రి సర్బానందా సోనోవాల్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రధాన ఓడరేవులు.. శ్రీకాకుళం జిల్లాలోని ములాపేట ఓడరేవు(భావనపాడు ఓడరేవు), కృష్ణ జిల్లాలోని మచిలీపట్నం ఓడరేవు, నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు, కాకినాడ SEZ ఓడరేవు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్నాయని పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ఓడరేవుల ఆధునీకరణ కోసం అనేక చర్యలు చేపట్టిందని కేంద్రం వెల్లడించింది. వాటిలో ఇప్పటికే ఉన్న బెర్తులు, టెర్మినల్స్ యాంత్రీకరణ, డిజిటలైజేషన్, లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్, కొత్త బెర్తులు, టెర్మినల్స్ నిర్మాణం, పెద్ద ఓడలకు అనువైన డ్రాఫ్ట్‌లను పెంచడానికి తవ్వకం, రోడ్డు, రై...