భారతదేశం, ఏప్రిల్ 29 -- ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు కీలకమైన అప్డేట్ వచ్చింది. మే1వ తేదీ నుంచి ఏపీలో నాలుగు ప్రాంతీయ బ్యాంకులు కనుమరుగు అవుతాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీలో ఇకపై ఒకే గ్రామీణ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకే బ్యాంకుగా కొనసాగిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకే బ్యాంకుగా నిర్వహిస్తారు. తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ), ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్(ఏపీజీవీబీ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు(సీజీజీబీ), సప్తగిరి గ్రామీణ బ్యాంకు(ఎస్‌జీబీ)లను విలీనం చేస్తారు. వీటి కార్యకల...