భారతదేశం, జనవరి 4 -- భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం అయిన శుభ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. 2014 - 2019 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ విమానాశ్రయ నిర్మాణం ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన 4 శాతం పనులు కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. 18 నెలల కాలంలో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదలు తెలిపారు చంద్రబాబు.

'భోగాపురం ఎయిర్ పోర్టు ఆ ప్రాంత కనెక్టివిటీ పెంచి అభివృద్దికి దోహద పడుతుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, నేషనల్ హైవేలు, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోంది. అన్న...