భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కూడా కొన్ని చోట్లు అధిక వర్షాలు పడే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజుల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీంతో గాలులు బలంగా వీచే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ పెరుగుతాయన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు బాగా పడే అవకాశం ఉందన్నారు.

ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పల...