భారతదేశం, ఫిబ్రవరి 8 -- తెలుగు రాష్ట్రాలలో వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత తగ్గుతూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పగటిపూట ఎండ వేడి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితిపై వాతావరణ శాఖ అప్డేట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వాయువ్య, ఈశాన్య దిశల నుండి గాలులు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణాన్ని కలిగిస్తున్నాయి.

కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉదయం సమయంలో పొగమంచు కనిపించవచ్చు. అమరావతి వాతావరణ కేంద్రం ఆది, సోమవారాల్లో పొడి పరిస్థితులు ఉంటాయని, కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరం, యానాంలో రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగ...